: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం... ఓ వ్యక్తికి గాయాలు
హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. నగరంలోని మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోకి తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపి అనంతరం బైక్‌పై పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని గాయాలపాలయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరావు పరిశీలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.