: జగన్ పై ఉన్న కేసుల దర్యాప్తు తీరుపై చంద్రబాబూ అదే అనుమానం వ్యక్తం చేశారట!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ఉన్న కేసుల విషయంలో దర్యాప్తు సంస్థల తీరుపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐ మెతక వైఖరిని అవలంబిస్తోందంటూ టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్న అనుమానాన్నే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారని, సీబీఐ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారని టీడీపీ నేతల సమాచారం. జగన్ పై ఉన్న కేసుల విచారణ ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని, ఈ విషయమై కేంద్రానికి, న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు చంద్రబాబుతో చర్చించారట. ఇందుకు, చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.