: హైదరాబాదు సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ సమీపంలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోన్న కర్నూలు జిల్లాకు చెందిన 24 ఏళ్ల సుబ్రహ్మణ్యం, మోహన్‌రెడ్డిగా వారిని పోలీసులు గుర్తించారు. వారిరువురు మరో ఆరుగురితో కలిసి బైక్‌లపై అనంతగిరి వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. రోడ్డు మార్గంలో దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉండగా సుబ్రహ్మణ్యం, మోహన్ రెడ్డిలు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.