: టైమ్ బాగోలేనప్పుడు డబ్బుల కోసం డ్యాన్స్ కూడా చేశా: షారుఖ్ ఖాన్
బాలీవుడ్ లో అత్యంత సంపన్నుల్లో ఒకడైన షారుఖ్ ఖాన్ కూడా చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాడట. 'హ్యాపీ న్యూ ఇయర్' మూవీనీ పూర్తి చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాడట. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, డబ్బు సర్దుబాటు కాలేదని... చివరకు ఓ పెళ్లిలో డ్యాన్స్ చేసి కావాల్సిన డబ్బు సంపాదించానని బాలీవుడ్ బాద్షా చెప్పాడు. సినీ నిర్మాణంలో ఇలాంటి ఇబ్బందులు సహజమేనని తెలిపాడు. జీవితంలో లాభనష్టాలు రెండూ భాగమేనని చెప్పాడు. టైమ్ బాగా లేనప్పుడు ఇబ్బందులు తలెత్తడం సహజమేనని తెలిపాడు. తన తాజా చిత్రం 'రాయీస్' గురించి మాట్లాడుతూ, సినిమాకు ఆ టైటిల్ పెట్టినంత మాత్రాన తాను పెద్ద ధనవంతుడినని కాదని... డబ్బు తనను ప్రభావితం చేయలేదని షారుఖ్ చెప్పాడు. 'నాన్నా నువ్వంటే నాకిష్టం' అని తన బిడ్డ అంటే రాయీస్ కన్నా ధనవంతుడిగా ఫీల్ అవుతానని తెలిపాడు.