: ఎయిర్‌పోర్ట్ వర్కర్లపై కాల్పులు జరిపిన దుండగుడు.. ఐదుగురు మహిళలు సహా ఓ డ్రైవర్ మృతి
ఆఫ్టానిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లో ఈ రోజు ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. ఓ వాహనంపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ రెచ్చిపోయాడు. ఈ ఘటనలో ఆ వాహనంలో ఉన్న ఐదుగురు మహిళలు సహా డ్రైవర్ ప్రాణాలుకోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న అక్కడి అధికారులు ప్రాణాలు కోల్పోయిన మహిళలను ఎయిర్ పోర్ట్ వర్కర్లుగా గుర్తించారు. వారిపై గుర్తు తెలియని వ్యక్తి ఎందుకు కాల్పులు జరిపాడన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ కాల్పులు ఉగ్ర చర్యేనని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.