: టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... వాయిదా తీర్మానాలపై కాంగ్రెస్ పట్టు
తెలంగాణ శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ... కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపై టీడీపీ, బీజేపీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.