: ప్రిన్స్ హ్యారీ తన గార్ల్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన వేళ!


ప్రిన్స్ హెన్రీ ఆఫ్ వేల్స్ తన గార్ల్ ఫ్రెండ్, అమెరికా నటి మేఘన్ మార్క్ లే తొలిసారిగా ఒక కెమెరాకు చిక్కారు. లండన్ లోని వెస్ట్ ఎండ్ లోని గీల్గుడ్ థియేటర్ లో ‘ది క్యూరియస్ ఇన్సిడెంట్ ఆఫ్ ది డాగ్ ఇన్ ది నైట్-టైమ్’ చిత్రం చూసేందుకు వెళ్లిన ఈ జంటను కెమెరాలో బంధించారు. ఈ ఫొటోలో హ్యారీ మాట్లాడుతూ ఉంటే, మేఘన్ తల వంచుకుని నవ్వుతూ ఉంది. కాగా, కెన్సింగ్టన్ ప్యాలెస్ కాటేజ్ లోనే ఆమె ఈ వారమంతా గడిపిందని, వారాంతంలో తిరిగి అమెరికా వెళ్లిపోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, క్రిస్మస్ నేపథ్యంలో క్వీన్స్ కౌంటీ ఎస్టేట్ లో సంప్రదాయ సంబరాలు జరుగుతాయి. ఈ సంబరాల్లో కేవలం రాజకుటుంబంలోని సభ్యులు మాత్రమే పాల్గొంటారు. అయితే, ఈ సంబరాల్లో హ్యారీతో పాటు మేఘన్ కూడా పాల్గొంటే కనుక అది ఆసక్తికరమైన వార్త అవుతుంది.
 

  • Loading...

More Telugu News