: కరీంనగర్ జిల్లా చరిత్రను ప్రపంచానికి చాటుతున్న వ్యక్తి బాలయ్య: ఎల్. రమణ
కరీంనగర్ జిల్లా చరిత్రను ప్రపంచానికి చాటుతున్న వ్యక్తి, నటుడు బాలయ్య అని టీటీడీపీ నేత ఎల్. రమణ అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమా తీయాలంటే ఎంతో ఆలోచించాలని, అలా ఆలోచించిన మీదటే నిర్మాతలు బాలయ్యను చూసుకొని ఈ సినిమా తీశారని, కరీంనగర్ జిల్లాలో పుట్టిన గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చూడబోతున్నారని అన్నారు. బాలకృష్ణ ఆ పాత్రలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.