: బాలకృష్ణలో రాజసం ఉట్టిపడింది.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ విడుదల
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటించిన నూరో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్ ను జగిత్యాలలోని ఓ సినిమా థియేటర్‌లో విడుదల చేశారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. గుర్రంపై స్వారీ చేస్తూ యుద్ధంలో శత్రు సైన్యంతో తలపడుతూ బాలకృష్ణ సినిమాలో కనపడిన తీరు ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది. సినిమా ట్రైలర్ ను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన నటుడిని గౌతమిపుత్ర శాతకర్ణిగా అభిమానులు చూసుకున్నారు. సినిమా టైటిల్ కి తగ్గట్టుగా బాలకృష్ణలో రాజసం ఉట్టిపడింది.