: 'పేటీఎం'నే మస్కా కొట్టించిన కేటుగాళ్లు!


పెద్ద నోట్ల రద్దు అనంతరం, ఆన్ లైన్ లావాదేవీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రజలంతా డిజిటలైజేషన్ లావాదేవీల వైపుకు మళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమ అకౌంట్ వివరాలు ఎవరి చేతిలోనైనా పడితే, తమ సొమ్ముకు గ్యారంటీ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జనాలకు ఈ డౌట్ రావడం సమంజసమే. ఇప్పటికే పలువురు తమకు తెలియకుండానే తమ అకౌంట్లలోని డబ్బులను కోల్పోయారు. అయితే, సామాన్యులనే కాదండోయ్... డిజిటల్ వాలెట్ సంస్థలను దోచుకుంటున్న కేటుగాళ్లు కూడా ఉన్నారు. ప్రముఖ సంస్థ పేటీఎంను కొందరు మోసగాళ్లు చీట్ చేశారు. 48 మంది కస్టమర్లు తమను రూ. 6.15 లక్షల మేర మోసం చేశారని పేటీఎం తెలిపింది. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోందని చెప్పింది.  

  • Loading...

More Telugu News