: జగిత్యాల చేరుకున్న బాలయ్య.. కాసేపట్లో 'గౌతమీపుత్రశాతకర్ణి' ట్రైలర్ విడుదల


ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ జగిత్యాల చేరుకున్నారు. జగిత్యాలలో కోటిలింగాల పుణ్యక్షేత్రం ఉంది. శాతవాహనుల కాలం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన కోటిలింగాల పుణ్యక్షేత్రంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తాజాగా నటించిన 'గౌతమీపుత్రశాతకర్ణి' సినిమా ట్రైలర్ ను స్థానిక సినిమా థియేటర్ లో విడుదల చేయనున్నారు. అనంతరం ఆన్ లైన్ లో పెడతారు. సినిమా విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని బాలకృష్ణ తెలిపారు. కాగా, సినిమా ఊహించినదానికంటే గొప్పగా వచ్చిందని చిత్రయూనిట్ తెలిపింది. ప్రత్యేక పూజల సందర్భంగా ఆయన వెంట దర్శకుడు, నిర్మాత, ఇతర యూనిట్ సభ్యులు కూడా వున్నారు. 

  • Loading...

More Telugu News