: పాకిస్థాన్ కు షాకిచ్చిన వరల్డ్ బ్యాంక్... కుతకుతలాడిపోతున్న పాక్


పాకిస్థాన్ కు వరల్డ్ బ్యాంకు ఊహించని షాకిచ్చింది. ఇస్లామాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వరల్డ్ బ్యాంక్ అధికారి విన్సెంట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ మ్యాపును ప్రదర్శించిన వరల్డ్ బ్యాంక్ అందులో పీవోకే  (పాక్ ఆక్రమిత కశ్మీర్), గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాలను మినహాయించి చూపించింది. దీంతో పాకిస్థాన్ నివ్వెరపోయింది. గిల్గిత్, బాల్టిస్థాన్ గురించి పెద్దగా పట్టించుకోని పాక్, పీవోకే భారత్ లో ఉన్నట్టు చూపించడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో వెంటనే అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తమ వద్ద పీఓకేతో కూడిన పాక్ మ్యాప్ లేదని వరల్డ్ బ్యాంక్ అధికారి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పాక్, వరల్డ్ బ్యాంక్ కార్యాలయం వద్దే తీవ్ర నిరసన తెలపాలని నిర్ణయించింది. 

  • Loading...

More Telugu News