: ఆ పచ్చబొట్టులో పంచభూతాలు, అమ్మ, నేను ఉన్నాం!: నటుడు సుశాంత్ సింగ్
‘పచ్చబొట్టు’ పొడిపించుకున్న వారిలో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులూ పచ్చబొట్టు ప్రియులే. తమకు నచ్చిన పేరునో, బొమ్మనో, ఆ రెండింటి విుశ్రమాన్నో..ఇలా తమకు నచ్చిన వాటిని తమ శరీరంపై ‘పచ్చబొట్టు’గా పొడిపించుకుంటుంటారు. ఈ కోవకు చెందిన నటుడే.. ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంలో ధోనీ పాత్ర పోషించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్.
పదహారేళ్ల వయసులోనే తన తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రేమానురాగాలను, వెలకట్టలేని ఆప్యాయతను కురిపించిన ఆ ‘అమ్మ’ను నిత్యం తలచుకునే సుశాంత్, తన వీపుపై ఒక పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ పచ్చబొట్టు ప్రత్యేకత గురించి స్వయంగా సుశాంతే తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల ద్వారా చెప్పాడు. తన వీపుపై పొడిపించుకున్న ఆ పచ్చబొట్టు ఫొటోను పోస్ట్ చేశాడు. ‘పంచభూతాలు, అమ్మ, నేను’ అని పోస్ట్ చేశాడు.