: ‘అన్నం పెట్టట్లేదు’.. తరగతులు బహిష్కరించి, స్కూలు విద్యార్థుల ఆందోళన
తరగతి గదుల్లో కూర్చొని చదువుకోవాల్సిన చిన్నారులు ఆందోళనకు దిగిన ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది పేద పిల్లలు కనీసం ఆ భోజనం కోసమైనా స్కూలుకి వస్తుంటారు. నీళ్లచారు పెట్టినప్పటికీ మారు మాట్లాడకుండా తినేస్తుంటారు. అయితే, రాజేంద్ర నగర్ ప్రాథమిక పాఠశాలలో పది రోజుల నుంచి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందడం లేదు. దీంతో ఆకలిబాధతో ఈ రోజు విద్యార్థులు తరగతి గదులు బహిష్కరించి ఆందోళన తెలుపుతున్నారు.