: ఇకపై నేను రీమేక్ లు చేయనని రామ్ చరణ్ కు కూడా చెప్పేశా: దర్శకుడు సురేందర్ రెడ్డి


ఇకపై తాను రీమేక్ లు చేయనని రామ్ చరణ్ కు కూడా చెప్పేశానని దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. ‘తని ఒరువన్’ తమిళ చిత్రానికి రీమేక్ అయిన ‘ధృవ’ దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘రీమేక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. మన  కథ అయితే ఎంత దూరమైనా వెళ్లి ఆలోచించవచ్చు. రీమేక్ లో అది సాధ్యం కాదు. రీమేక్ అంటే.. ఒక గదిలో మనల్ని బంధించేసినట్లే!. ఏం చేసినా ఆ గది పరిధిలోనే చేయాలి. ‘ధృవ’ నా తొలి రీమేక్ చిత్రం. ఇదే చివరి రీమేక్ కూడా.  ఇకపై నేను రీమేక్ చిత్రాలు చేయలదలచుకోలేదు' అని రామ్ చరణ్ కి కూడా చెప్పేశాను’ అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News