: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. లోక్‌సభలో గందరగోళం.. వాయిదా
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. మరో రెండు రోజులు మాత్రమే సమావేశాలు మిగిలి ఉండడంతో అధికార పక్షాన్ని పెద్దనోట్ల రద్దుపై ఇరుకున పెట్టే ప్రయత్నంలో విపక్ష సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో బీజేపీ సీనియర్ నేత అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోక్‌సభకు హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన నాయకుడు పీవీ రాజేశ్వర్ రావు మృతి పట్ల సభలో సంతాపం తెలిపారు. అనంతరం పెద్దనోట్ల రద్దుపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, అనంత కుమార్, పారికర్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.