: మోదీ లక్ష్యం.. నందన్ నీలేకని సాయం.. డిజిటల్ పేమెంట్స్ సరళతరం కోసం సూచనలు


ఆధార్ వ్యవస్థ రూపకర్త నందన్ నీలేకని కేంద్రానికి తనవంతు సాయం అందించేందుకు మరోమారు ముందుకొచ్చారు. గతంలో ఎన్డీఏ హయాంలో ఆధార్‌కు రూపకల్పన చేసిన ఆయన ఇప్పుడు ప్రధాని మోదీ లక్ష్య సాధన కోసం మరోమారు సాయం అందించనున్నారు. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ ప్రజలను డిజిటల్ చెల్లింపులవైపు మరల్చాలన్న మోదీ లక్ష్యంలో నీలేకని భాగం కానున్నారు. యూఎస్ఎస్‌డీ విధానంతో స్మార్ట్‌ఫోన్ల ద్వారా చేసే పేమెంట్స్ విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు అవసరమయ్యే సూచనలు, సలహాలను నీలేకని అందించనున్నారు. ఫీచర్ ఫోన్లలోనూ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోగలిగేలా అభివృద్ధి చేయనున్న విధానంలో ఆయన కీలక సలహాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News