: సోదరుడి వివాహంలో సన్నీ లియోన్ సందడి
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన సోదరుడు సందీప్ ఓహ్రా వివాహ వేడుకలో సందడి చేసింది. వృత్తి రీత్యా చెఫ్ అయిన ఓహ్రా, కరిష్మా నాయుడుల వివాహం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగింది. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలకు సన్నీ, తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి హాజరయింది. వివాహ వేడుకకు బ్లూ కలర్ కుర్తా పైజామా దుస్తుల్లో మెరిసిపోయిన ఆమె, పెళ్లికి ముందు నిర్వహించిన పార్టీలో మాత్రం మోడ్రన్ డ్రెస్ ధరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్నీ లియోన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.