: బుర్హాన్ వనీ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఎలా ఇస్తారు? ఇది ఆర్మీని అవమానించడం కాదా?: కాంగ్రెస్


బీజేపీ మద్దతుతో అధికారంలో ఉన్న జమ్మూకశ్మీర్ ప్రభుత్వం బుర్హాన్ వనీ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడాన్ని దేశధిక్కార చర్యగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా అభివర్ణించారు. దేశసరిహద్దులను నిత్యం కాపాడుతున్న భద్రతా దళాలపై యుద్ధానికి దిగిన వ్యక్తిని భద్రతాదళాలు ఎన్ కౌంటర్ చేస్తే, అతనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ఇది ఆర్మీని అవమానించడం కాదా? అని ఆయన నిలదీశారు. ఇది దేశ ద్రోహం కాదా? అని ఆయన అడిగారు. అధికారంలో ఉన్న పార్టీ దీనిని సమర్థించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. ఆయన సోదరుడు పోలీసు కాల్పుల్లో మరణించాడని చెబుతున్నారని, ఉగ్రవాదుల కుటుంబాలకు సాయం చేస్తే, ఆ కుటుంబాల నుంచి ఉగ్రవాదులు తయారు కారా? అని ఆయన నిలదీశారు. దీనికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందని ఆయన అడిగారు. 

  • Loading...

More Telugu News