: అమ్మ తర్వాత అంతటి సమర్థురాలు శశికళే!: జై కొట్టిన పన్నీర్ సెల్వం
జయలలిత నెచ్చెలి శశికళకు అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టడానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం శశికళకు జై కొట్టారు. అమ్మ జయ తర్వాత అంతటి సమర్థురాలు శశికళే అని ఆయన తెలిపారు. శశికళతో తనకు విభేదాలు లేవని... పుకార్లను పట్టించుకోవద్దని ఆయన కోరారు. శశికళ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవని... పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమే బాధ్యతలు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు, అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, పలువురు మంత్రులు, పార్టీకి చెందిన పలువురు నేతలు మొన్న పోయస్ గార్డెన్ లో శశికళను కలిసి పార్టీ బాధ్యతలను చేపట్టాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో, అమ్మ స్థానాన్ని చిన్నమ్మ ఆక్రమించడం ఇక నామమాత్రమే.