: చూడ్డానికి పక్షిలా ఉండే చేప... సోషల్ మీడియాలో హల్ చల్


పక్షిలా కనిపించే నీటి బాతు, నీటి కొంగల గురించి విన్నాం. హసలు కూడా గాల్లోనూ, నీట్లోనూ అవలీలగా సుదూరాలకు వెళ్లగలవు. అయితే పక్షిలా కనిపిస్తున్నా, ఎగరలేని చేప గురించి అరుదుగా విని ఉంటారు. ఇంకొందరు అసలు విని ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి సముద్ర జీవుల గురించి పురాతన గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. వీటిని క్రినాయిడ్స్‌‌ గా పేర్కొన్నారు. ఇవి నక్షత్ర చేపలు, సముద్ర అర్చిన్స్‌ వర్గానికి చెందిన జీవులు. కోరల్‌ రీఫ్స్ అల్లుకున్న ప్రాంతాల్లోని రాళ్లపై ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి అత్యంత అరుదుగా ఈత కొడుతూ కనిపిస్తాయి. థాయిలాండ్‌ సముద్రతీరంలో బాలికి చెందిన ప్రొఫెషనల్‌ డైవర్‌ ఎల్స్‌ వాన్‌ ఐజెండెన్‌ సముద్రంలో ఈతకొడుతుండగా పక్షి ఈకలతో ఉన్న అత్యంత అరుదైన నక్షత్ర చేప (ఫెదర్‌ స్టార్‌) ఈదుతూ కనిపించింది. క్షణం ఆలస్యం చేయని వాన్ ఐజెండెన్ ఆ అరుదైన దృశ్యాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. కావాలంటే మీరు కూడా దానిని చూడండి. 

  • Loading...

More Telugu News