: జైపూర్ లో పట్టుబడ్డ 64 లక్షల రూపాయలు
అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన కొత్త రెండు వేల రూపాయలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. రెండు రోజుల క్రితం చెన్నైలో ఒక వ్యక్తి వద్ద వంద కోట్లు పట్టుబడగా, కర్ణాటకలో మరో వ్యక్తి బాత్రూంలో పెద్ద ఎత్తున పెద్ద నోట్లు పట్టుబడ్డాయి. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో 64 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. అందులో 58 లక్షల రూపాయల విలువైన 2000 నోట్లు ఉండడం విశేషం.