: ఏపీలో ఈదురుగాలుల బీభత్సం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఎగిరి పడుతున్న హోర్డింగులు
వార్దా తుపాను ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొన్ని చోట్ల చెట్లు నేలకొరగగా, కొన్ని చోట్ల హోర్డింగులు ఊడి పడుతున్నాయి. ఈదురు గాలుల ధాటికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రధానరహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి చమురు వృథాగా నేలపాలైపోతోంది. దీంతో అక్కడి నుంచి వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్యాంకర్ బోల్తా పడడం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.