: చెన్నయ్‌ తీరాన్ని తాకి విరుచుకుప‌డుతున్న‌ ‘వార్దా’ అతితీవ్ర తుపాను.. విరిగిపడుతున్న చెట్లు


తూర్పు దిశలో కేంద్రీకృతమై ఉన్న 'వార్దా' అతితీవ్ర‌ తుపాను వేగంగా దూసుకొచ్చి చెన్నయ్‌ తీరాన్ని తాకింది.  గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.  దీంతో తమిళనాడు ప్రభుత్వం మ‌రింత‌ అప్రమత్తమైంది.  త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం అధికారుల‌తో భేటీ అయి ప‌లు సూచ‌న‌లు చేశారు. చెన్నయ్ తీరాన్ని తాకిన వార్దా ఆ న‌గ‌రంపై విరుచుకుపడుతోంది. చెన్నయి-గూడూరు మ‌ధ్య రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌ట్టాల‌పై, ర‌హ‌దారుల‌పై చెట్లు విరిగిప‌డుతున్నాయి. దీంతో ప‌లు మార్గాల్లో రైళ్లు, వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, చెట్లు, స్తంభాల వద్ద నించోకూడదని తమిళనాడు ప్రభుత్వం సూచిస్తోంది.  



  • Loading...

More Telugu News