: నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 మధ్యకాలంలో రోజుకు 89,000 కిలో లీటర్ల పెట్రోల్ విక్ర‌యం!


పెద్దనోట్ల రద్దు ప్రభావంతో నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 మధ్యకాలంలో రోజుకు సగటున ఏకంగా 89,000 కిలో లీటర్ల పెట్రోల్ విక్ర‌యాలు జరిగాయి. పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత వాటిని పెట్రోల్, డీజిల్ బంకుల్లో, గవర్నమెంటు ఆసుపత్రుల్లో తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌త‌నెల‌లో ఇంధన అమ్మకాలు ఒక్క‌సారిగా 10 శాతానికి పైగా అధికంగా న‌మోద‌య్యాయి. అంచనాల‌కు అంద‌ని విధంగా ఈ అమ్మకాలు జ‌రిగాయి. ఎంతో మంది వాహ‌నదారులు రద్దయిన 500, 1000 రూపాయ‌ల‌ నోట్లతో తమ ట్యాంకులను నింపేసుకున్నార‌ట‌.  ప్రభుత్వ రంగ సంస్థలయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 మధ్యకాలంలో రోజుకు సగటున 89,000 కిలో లీటర్ల పెట్రోల్ను అమ్మేశాయి‌.

 మ‌రోవైపు డీజిల్ విక్ర‌యాలు కూడా ఇదే స్థాయిలో జ‌రిగిన‌ట్లు తెలిసింది.  నవంబర్ 9 నుంచి డిసెంబర్ 7  మ‌ధ్య కాలంలో డీజిల్ అమ్మ‌కాలు రోజుకు సగటున 2,25,000 కిలో లీటర్లు అమ్ముడుపోయాయి. ఈ సమయంలోనే వీటి విక్ర‌యాల పెరుగుద‌ల‌ 11.4 శాతంగా న‌మోద‌యింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలు భార‌త్‌లోని మొత్తం ఇంధన అమ్మకాల్లో 90 శాతం ఆక్రమిస్తాయి.

  • Loading...

More Telugu News