: 13న వైఎస్సార్సీపీలో చేరుతున్నాను: మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
ఈ నెల 13వ తేదీన తాను వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాను పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రజల తరపున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని, అందుకే, ఈ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఏపీలో బీజేపీని చంద్రబాబుకు తాకట్టుపెట్టారని, చంద్రబాబు అవినీతిని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు.