: గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడి అరెస్టు
ప్రముఖ వ్యాపార వేత్త గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు, భూ సమీకరణ ప్రత్యేక అధికారి భీమా నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భీమా నాయక్ తో పాటు అతని కారు డ్రైవర్ మహ్మద్ ను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి సమయంలో సుమారు రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు భీమా నాయక్ సహాయాన్ని తీసుకున్నారని, ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ నాయక్ కారు డ్రైవర్ రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.