: కరుణానిధి ఇంటికెళ్లి పరామర్శించిన రజనీకాంత్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. చెన్నైలోని గోపాలపురలోని కరుణానిధి ఇంటికెళ్లి మరీ రజనీకాంత్ పరామర్శించడం తమిళనాట ఆసక్తి రేపుతోంది. తమిళనాడు రాజకీయాల్లో చోలుచేసుకుంటున్న పరిణామాల మధ్య రజనీ, కరుణను కలవడం ఆసక్తి పెంచుతోంది. కాగా, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, డిశ్చార్జ్ అయిన కరుణానిధిని రజనీ కలవడం వెనుక ఎలాంటి రాజకీయాంశాలు లేవని ఇరు వర్గాలు చెబుతున్నాయి.