: అక్కినేని కుటుంబాన్ని చూస్తే చాలాసార్లు నాక్కూడా అలాగే అనిపించింది: సమంత


టాలీవుడ్ యువ నటుడు అఖిల్‌ అక్కినేని, ఫ్యాషన్ డిజైనర్ శ్రియభూపాల్‌ ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత, అఖిల్, శ్రియభూపాల్, నాగార్జున, నాగ చైతన్యతో కలిసి దిగిన ఒక ఫొటోను సమంత ట్విట్ట్ చేసింది. ఈ సందర్భంగా త్వరలో దంపతులు కానున్న అఖిల్‌ జంటకు శుభాకాంక్షలు చెప్పింది. వారిద్దరి భవిష్యత్ అందంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వ్యాఖ్యను జతచేసింది. దీనిని సమంత, అక్కినేని అభిమానులు రీట్వీట్‌ చేస్తూ వారిని ప్రశంసించారు. విష్ణు అనే అభిమాని మాత్రం 'అబ్బా.. అక్కినేని కుటుంబాన్ని చూస్తుంటే చాలా అసూయగా ఉంది. ఒక్కసారి వారిని చూడండి, అసలు వారికి వయసనేది లేదు. అమరులు' అంటూ సమంతను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనిని రీ ట్వీట్ చేసిన సమంత, 'హహహ! నిజమే కదా... పలు సందర్భాల్లో నాక్కూడా అచ్చం ఇలాగే అనిపించింది' అంటూ సమాధానం చెప్పింది. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News