: స్కోరు సమం చేసిన టీమిండియా... ఇక ఆధిక్యమే!


ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ రేకెత్తిస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. తొలిరోజు ఆటపై ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పూర్తి ఆధిపత్యం చెలాయించగా, రెండో రోజు టీమిండియా బౌలర్లు తమ సత్తాచాటారు. అనంతరం టీమిండియా బ్యాట్స్ మన్ కూడా ఇంగ్లిష్ బౌలర్లను ఆటాడుకున్నారు. ప్రధానంగా టీమిండియా టాపార్డర్ అద్భుతంగా రాణించింది. అయితే, టీమిండియా మీడిలార్డర్, టెయిలెండర్లు మాత్రం ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు. సెంచరీలు సాధించిన ఆటగాళ్లంతా బరిలో దిగినా ఊహించిన స్థాయిలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన లేకపోవడం విశేషం. కాగా, మురళీ విజయ్ (136), కెప్టెన్ విరాట్ కోహ్లీ (119) రాణించగా, వారికి పుజారా (47), రవీంద్ర జడేజా (25), కేఎల్ రాహుల్ (24) సహకరించారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తో స్కోరును సమం చేసింది. ఇకపై చేసే పరుగులన్నీ భారత్ కు ఆధిక్యం అందించేవే కావడం విశేషం. ప్రస్తుతం భారత్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 400 పరుగులు.

  • Loading...

More Telugu News