: నాకు ఆ టైటిల్ సరిపోదు...ఈ టైటిల్ అయితే ఓకే!: అమీర్ ఖాన్


'బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్' అనే టైటిల్ తనకు సరిపోదని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నాడు. ముంబైలో 'దంగల్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజానికి తాను 'మిస్టర్ పర్ఫెక్ట్' కాదని చెప్పాడు. ఈ టైటిల్ తనపై ఒత్తిడి తీసుకురాదని స్పష్టం చేశాడు. నిజానికి తనకు 'మిస్టర్ ఫ్యాషనేట్' అన్న టైటిల్ సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. సినిమాకు సంబంధించిన సాంకేతిక అంశాలపై తనకు అవగాహన లేదని అన్నాడు. ఒక సన్నివేశంలో ఓ పాత్ర ఎలా స్పందిస్తుందో అలాగే నటించడానికి తాను ప్రయత్నిస్తానని, ఇతర అంశాలు తనకు తెలియవని పేర్కొన్నాడు. పర్ఫెక్షన్ అంటే మనలా ఇంకెవరూ చేయకపోవడమని, ఇప్పుడు చాలా మంది సరికొత్త ఆలోచనలతో వస్తున్నారని, అలాంటి వారికి అది సరిపోతుందని అమీర్ ఖాన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News