: మేము ఇంకొకరు భయపెడితే భయపడే రకం కాదు: వెంకయ్య నాయుడు
పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న విపక్ష సభ్యుల తీరుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు తమని భయపెట్టాలని చూస్తున్నాయని, అయితే తాము ఇంకొకరు భయపెడితే భయపడే రకం కాదని ఆయన అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, గందరగోళం సృష్టిస్తున్నది ఎవరో ప్రజలకి తెలుసని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో పెద్దనోట్ల రద్దుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షనేతలే ఒప్పుకోవడం లేదని అన్నారు.