: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు: టీఆర్ఎస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలే కొట్లాడి తెలంగాణను సాధించుకున్నారని ఆయన అన్నారు. హైదరాబాదు శివారు నానక్ రాంగూడలో బిల్డింగ్ కూలిపోయిన ఘటనపై కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో ఉండి సహాయక చర్యలను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారని చెప్పారు. దీనికి బాధ్యులైన అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిందని తెలిపారు. శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News