: జయలలిత ఫొటో ముందే కొనసాగిన తమిళనాడు కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
జయలలిత కన్నుమూసిన తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ రోజు మొదటిసారిగా రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. సమావేశానికి ముందు జయలలిత సమాధివద్ద పన్నీర్ సెల్వంతో పాటు ఆ రాష్ట్రమంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయ భవనంలోనూ జయలలిత చిత్రపటాన్ని ఉంచి ఆ ఫొటో ముందే కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. జయలలిత పేరిట మెరీనా బీచ్ వద్ద ఘాట్ నిర్మాణానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జయలలిత రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జయలలిత స్మారక విగ్రహాల ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.