: మోదీ నోట్ల రద్దు బురద మాకూ అంటుతోంది: ఎంపీ రాయపాటి


పెద్ద నోట్ల రద్దు మూలంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ కరెన్సీ కష్టాలు ఎన్ని రోజులకు తొలగుతాయో కూడా అర్థం కావడం లేదని తెలిపారు. నోట్ల రద్దుతో ప్రధాని మోదీ బురద అంటించుకున్నారని... ఆ బురదను కడిగేందుకు తమ అధినేత చంద్రబాబు నేతృత్వంలో కమిటీ వేశారని... ఇప్పుడు ఆ బురద మాకు కూడా అంటే ప్రమాదం ఉందని అన్నారు. నల్లధనమంతా కాంగ్రెస్ నేతల వద్దే ఉందని... ఆ బ్లాక్ మనీని మార్చుకోలేకే వారు పార్లమెంట్ ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News