: బిగుస్తున్న ఉచ్చు... శేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌లను అరెస్టు చేసే అవకాశం
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సోదాలు జరుపుతున్న అధికారులకు టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి చెందిన కోట్లాది రూపాయల నల్లధనం బయపడుతున్న విషయం తెలిసిందే. నిన్న ఏకంగా రూ.174 కోట్ల నగదు, 127 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ రోజు అతడికి చెందిన కారును వెంబడించి మరో రూ.24 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఆదాయపన్ను శాఖ ఈడీకి అప్పగించనుంది. ఈ నేపథ్యంలో శేఖర్‌రెడ్డి సహా అతడి అనుచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌ను అధికారులు అరెస్టుచేసే అవకాశం ఉంది. గత మూడురోజులుగా జరుపుతున్న సోదాల్లో ఆయన వద్ద నుంచి భారీగా నగదు లభ్యం అవుతుండడతో అధికారులు సైతం విస్తుపోతున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తమిళనాడులోని విపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.