: ఒకే మ్యాచ్ లో మూడు రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లీ
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు ఈ యంగ్ రన్ మెషీన్. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు అతని చెంతకు చేరుతున్నాయి. తాజాగా, ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ ఏకంగా మూడు రికార్డులు క్రియేట్ చేశాడు. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒక క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. అంతేకాదు, కెప్టెన్ గా ఒకే క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ ఘనతను సచిన్, ద్రావిడ్ లు సాధించారు. అంతేకాదు, 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 4000 పరుగుల మైలు రాయిని దాటాడు. ఇప్పటి వరకు ఈ ఘనతను మరో 13 మంది భారత బ్యాట్స్ మెన్ సాధించారు.