: అలాంటి వాటికి మొదట్లో మా సోదరుడు అభ్యంతరం చెప్పాడు... తర్వాత అర్థం చేసుకున్నాడు: హీరోయిన్ పూర్ణ
ఎంతో గ్లామరస్ గా ఉండే పూర్ణ... చీరకట్టుతో సంప్రదాయబద్ధంగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ను పూర్ణ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్ణ ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. తాను సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చానని... దాంతో, ముద్దులాంటి అభ్యంతరకర సన్నివేశాల్లో నటించవద్దంటూ తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన సోదరుడు షరతు విధించాడని చెప్పింది. అయితే, సినిమాల్లో ఇవన్నీ కామన్ అనే సంగతి ఆ తర్వాత తన కుటుంబసభ్యులకు అర్థమయిందని... ఇప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని తెలిపింది. అలాంటి సీన్లను తన కుటుంబంతో కలసి చూడాలంటే తనకు కూడా ఇబ్బందిగా ఉంటుందని... అందుకే థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు, ఆ సీన్లు వచ్చే సమయానికి బయటకు వెళ్లిపోతానని చెప్పింది.