: పెద్దనోట్ల రద్దు తర్వాత వందకోట్ల వ్యాపారం చేసిన మసైదిలాల్ జ్యూయలర్స్ పై కేసు నమోదు


పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న మసైదిలాల్ జ్యూయలర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం సదరు జ్యూయలర్స్ వందకోట్ల వ్యాపారం చేసింది. ఆ నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్లు ఐటీ శాఖాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులకు సదరు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో, మసైదిలాల్ జ్యూయలర్స్ డైరెక్టర్లు నితిన్ గుప్తా, మల్లేష్, కైలాష్ చంద్ గుప్తాలను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News