: ఈ ఫొటోకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు?: ఎంఎస్ ధోనీ


‘ఈ ఫొటోకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు?’ అంటూ టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఒక ఫొటో పోస్ట్ చేశారు. తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన ఈ ఫొటోలో ఉన్నది ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు.. ధోనీ గారాల పట్టి, పది నెలల వయసున్న జీవా! అదిరిపోయే డ్రెస్సులో ఉన్న జీవా, ఒక ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుతూ ఫొటోకు పోజు ఇచ్చింది. ఈ ఫొటోను ధోనీ పోస్ట్ చేశాడు. ‘ఈ ఫొటోకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు?’ అని ప్రశ్నించాడు. ఇక, ధోనీ అభిమానులు ఊరుకుంటారా, విజృంభించారు.. పదికి పదికి రేటింగ్ ఇచ్చేశారు. మరికొందరు అభిమానులు అయితే..‘క్యూట్’, ‘అడోరబులు ప్రిన్సెస్’, ‘షీ ఈజ్ సో అడోరబుల్, గాడ్ బ్లస్ హర్’, ‘లవ్లీ’ అంటూ ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News