: వరుస పండుగల నేపథ్యంలో పలుమార్గాల్లో నడపనున్న ప్రత్యేక రైళ్ల వివరాలు!
రానున్న క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వరుస వేడుకల నేపథ్యంలో పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించుకున్నారు. వాటి వివరాలను ఈ రోజు తెలిపారు. మొత్తం 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు. వాటి వివరాలు... * ఈ నెల 15 నుంచి వచ్చే నెల 26 వరకు ప్రతి బుధవారం విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. * ఇవే తేదీల మధ్య సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రతి సోమవారం పలు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. * డిసెంబర్ 16 నుంచి జనవరి 27 వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్-కాకినాడ మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. * ఇక, కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రతి శనివారం రైళ్లను నడపనున్నారు.