: సవాళ్లు విసరడం, ఆ తర్వాత తోకముడవడం టీఆర్ఎస్ కు అలవాటే: షబ్బీర్ అలీ


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఈ రోజు టీఆర్ఎస్ పై మండిపడ్డారు. సవాళ్లు చేయడం, ఆ తర్వాత తోకముడవడం టీఆర్ఎస్ కు అలవాటేనని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని టీఆర్ ఎస్ కడిగేయడం కాదు, టీఆర్ఎస్ ని ప్రజలు కడిగేసే సమయం ముందుందని ఆయన హెచ్చరించారు. ఎవరిని ఎవరు కడిగేస్తారో తెలియాలంటే.. ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుపై విమర్శలు కురిపించారు. రాజకీయాల్లో హరీష్ రావు ఒక బచ్చా అని, టీఆర్ఎస్ మేనిఫెస్టోపై చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ వాగ్దానాలను ఐదు శాతం కూడా అమలు చేయలేదని షబ్బీర్ అలీ విమర్శించారు.

  • Loading...

More Telugu News