: జయలలిత పేరుతో ‘జే అన్నాడీఎంకే’ పార్టీ?


జయలలిత మృతితో అన్నాడీఎంకే పార్టీని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని పలువురు పోటీపడుతున్నారు. ముఖ్యంగా జయలలిత నెచ్చెలి, చిన్నమ్మగా పిలిచే శశికళ, సీఎం పన్నీరు సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్లు ఈ విషయంలో వినపడుతున్నాయి. ఈ తరుణంలో జయలిత పేరుతో ‘జే అన్నాడీఎంకే’ పేరుతో సరికొత్త పార్టీ ఒకటి ఆవిర్భనించనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జయలలితకు వీరాభిమాని, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కృష్ణమూర్తి ఈ పార్టీని ప్రారంభించనున్నారనే ఒక ఆడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అన్నాడీఎంకే పార్టీలో శశికళ పెత్తనానికి నిరసనగానే ‘జే అన్నాడీఎంకే’ పార్టీని స్థాపించబోతున్నామని, ఆ పార్టీకి జయలలిత అన్న కూతురు దీపను అధ్యక్షురాలిగా నియమిస్తానని ఆ ఆడియోలో పేర్కొన్నారు. కాగా, ఈ ఆడియోపై శశికళ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేతో తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని, ఆమె మద్దతుదారులు తనను చంపుతానని బెదిరించారని కృష్ణమూర్తి వాపోయారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో కూడా సామాజిక మాధ్యమాలకు చేరడం గమనార్హం.

  • Loading...

More Telugu News