: మరింత దిగజారిన బంగారం, వెండి ధరలు
ఆభరణాల తయారీదారులు, ట్రేడర్ల నుంచి కొనుగోలు మద్దతు లేకపోవడంతో బంగారం ధర మరింతగా దిగజారింది. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్లో కొనుగోలు సెంటిమెంట్ లేక, పది గ్రాముల బంగారం ధర క్రితం (ఫిబ్రవరి 3 డెలివరీ) ముగింపుతో పోలిస్తే రూ. 22 తగ్గి 0.08 శాతం నష్టంతో రూ. 27,755కు చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు (మార్చి 3 డెలివరీ) రూ. 126 తగ్గి, 0.30 శాతం నష్టంతో రూ. 41,399 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్ ధర బ్యారల్ కు రూ. 34 పెరిగి రూ. 3.461 కి చేరింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ మరింతగా దిగజారి, రూ. 67.59కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 24 పైసలు అధికం.