: జయలలిత ఆదేశించారు...శశికళ అడ్డుకున్నారు!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి రోజుకోవార్త వెలుగుచూస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జయలలిత ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ దశలో ఆమె స్పృహలో లేరు. చికిత్స తర్వాత మెలకువలోకి వచ్చిన ఆమె, తాను ఆసుపత్రికి వచ్చి ఎన్ని రోజులైందని వైద్యులను ప్రశ్నించారట. దీంతో వైద్యులు ఆమె ఆసుపత్రికి వచ్చి ఎన్ని రోజులైందో వివరించారట. దీంతో తన గురించి ప్రజలేమనుకుంటున్నారని అడిగారట. ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని, ఆమె క్షేమంగా రావాలని పూజలు చేస్తున్నారని వారు సమాధానమిచ్చారట. దీంతో వెంటనే తన ఫోటో, ప్రకటన విడుదల చేయాలంటూ ఆమె వైద్యులను ఆదేశించారట. వైద్యులు కూడా అందుకు సమాయత్తమయ్యారు. అయితే బయటకి వచ్చిన వైద్యులను ఆమె నెచ్చెలి శశికళ అడ్డుకున్నారట. ప్రజలు ఇప్పటికే బాధలో ఉన్నారని, అనారోగ్యంతో ఉన్న జయలలిత ఫోటోలు విడుదల చేస్తే మరింత ఆందోళనకు గురవుతారని వైద్యులకు సర్దిచెప్పి, ఆ ప్రకటన, ఫోటోలు రాకుండా చేశారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News