: ఎంపీలకు సభలో చర్చించే హక్కు తప్ప, సభను అడ్డుకునే హక్కులేదు: రాష్ట్రపతి ప్రణబ్


ఎంపీలకు సభలో చర్చించే హక్కు ఉంటుంది కానీ, సభను అడ్డుకునే హక్కులేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గత పదిహేను రోజులుగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఈరోజు ప్రణబ్ స్పందిస్తూ, పార్లమెంట్ కు ఎంపీలను ప్రజలు పంపించింది ధర్నాలు చేసేందుకు కాదన్న విషయాన్ని వారు గ్రహించాలని అన్నారు. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఉభయసభలు అట్టుడికిపోయాయి. ఉభయసభలను విపక్షాలు స్తంభింపజేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభలు వాయిదా వేయక తప్పటం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ప్రణబ్ పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News