: నా బెస్ట్ సెల్ఫీలలో ఇది కూడా ఒకటి: అల్లు అర్జున్


క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. ఈ సందర్భంగా సచిన్ తో కలిసి ఒక సెల్ఫీ దిగారు. బన్నీ ఈ సెల్ఫీ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘నేను దిగిన ఉత్తమమైన సెల్ఫీల్లో ఇది కూడా ఒకటి. సచిన్ తో కలిసి బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు సహ యజమానిగా వ్యవహరిస్తున్నందుకు గౌరవంగా ఉంది’ అని ఆ ట్వీట్ లో బన్నీ పేర్కొన్నాడు. ఈ సెల్ఫీలో సచిన్, అల్లు అర్జున్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారు.

  • Loading...

More Telugu News