: టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో ఫుల్ బిజీ
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాంఖడేలో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు సాధన ప్రారంభించాయి. ప్రధానంగా రెండు జట్ల బ్యాట్స్ మన్ పేసర్లతో బంతు లేయించుకుని ప్రాక్టీస్ చేశారు. నెట్ ప్రాక్టీస్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్, రంజీ ఆటగాళ్లతో బంతులేయించుకుని సాధన చేశారు. ఇప్పటికే రెండు విజయాలతో ముందంజలో ఉన్న టీమిండియాపై ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో సాధన చేశారు.