: 'నేను బాగానే ఉన్నా'... హాస్పిటల్ నుంచి ట్వీట్ చేసిన దిలీప్ కుమార్


అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈ రోజు ఉదయం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాలు వాచిపోయి, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న దిలీప్ ను ఆయన సతీమణి సైరాబాను హుటాహుటీన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దీంతో, అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి కలవరపడ్డారు. అయితే, తాను బాగానే ఉన్నానంటూ దిలీప్ కుమార్ ఆసుపత్రి నుంచి ట్వీట్ చేశారు. తాను బాగానే ఉన్నానని... తన పర్సనల్ ఫిజీషియన్స్ గోఖలే, నితిన్, శర్మలు తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ట్విట్టర్లో తెలిపారు. తనను గుండెల్లో పెట్టుకుని ఆరాధించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News