: మమతా బెనర్జీ గురించి నేను అలా అనలేదు: బాబా రాందేవ్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ప్రధానమంత్రి కాగల అన్ని అర్హతలు ఉన్నాయని తానెప్పుడూ అనలేదని బాబా రాందేవ్ అన్నారు. ఆ వార్తా కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు. ఆజ్ తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. దీదీ ప్రధాని కావచ్చు కదా? అని గతంలో తనను కొందరు ప్రశ్నించారని... ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చని మాత్రమే తాను చెప్పానని... అంతేతప్ప దీదీ ప్రధాని అవుతారని తాను చెప్పలేదని వివరణ ఇచ్చారు. కానీ, మీడియా తన మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. అయితే, మమత గడుపుతున్న సాదాసీదా జీవితాన్ని మాత్రం ఆయన అభినందించారు.